నెల్లూరు జిల్లాలో టీడీపీలోకి నేతలు, కార్యకర్తలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల షెడ్యూల్ రాకముందే టీడీపీలోకి భారీ సంఖ్యలో చేరుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో చేరికలు ఊహించలేరన్నారు. వైసీపీ నుంచి చాలా మంది పెద్ద నేతలు టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని.. వారంతా ముహుర్తాలు చూసుకుంటున్నారన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని కోటంరెడ్డి పేర్కొన్నారు.