రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం ఏర్పడుతుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాం జనేయ చౌదరి (తపనా చౌదరి) అన్నారు. బీజేపీ పల్లె నిద్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా, వేలేరుపాడు మండలంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ, జనసేన పార్టీ సిద్ధాంతాలు రెండు ఒకేవిధంగా ఉన్నాయని, రాష్ట్రంలో, దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలన్నారు. నిర్వాసితు ల సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా వెళతామన్నారు.