ప్రజా సంక్షేమానికి వైసీపీ తూట్లు పొడిచిందని, నిరంకుశ పాలనకు త్వరలోనే అంతం అవుతుందని గిద్దలూరు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం బేస్తవారపేట మండలానికి చెందిన సత్తేలి కృష్ణయాదవ్ ఆధ్వర్యంలో 70 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వారికి మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అశోక్‌రెడ్డి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు టీడీపీ పెద్దపీట వేస్తోందన్నారు. వారి అభ్యున్నతి కోసం అనేక ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు. పార్టీలో చేరిన కృష్ణయాదవ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో అశోక్‌రెడ్డి గెలుపు కోసం కృషిచేస్తామన్నారు. పార్టీలో చేరిన వారిలో సత్తేలి రంగయ్య, సత్తేలి కాశి, చక్కా సరస్వతి, వీణ, బాదం కృష్ణ, తదితరులు ఉన్నారు. బేస్తవారపేట మండలపార్టీ అధ్యక్షులు సోరెడ్డి మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుంటక నరసింహయాదవ్, ఎంపీటీసీ సభ్యుడిగా పూనూరి భూపాల్‌రెడ్డి, టీడీపీ నాయకులు ఆదాం, పట్టణ అధ్యక్షులు దూదేకుల సైదులు, క్లస్టర్ ఇన్చార్జ్ ముప్పూరి రామయ్య తదితరులు పాల్గొన్నారు.