మహానంది క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు రోజు కావడంతో పాటు పెళ్లి ముహూర్తాలకు మంచి రోజు కావడంతో క్షేత్రంలో పదుల సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఒక వైపు భక్తులతో పాటు పెళ్లి బృందాలతో మహానంది పరిసరాలు వేలాదిమందితో కిటకిటలాడాయి. మహానందీశ్వరుని దర్శనం కోసం గంటల కొద్ది క్యూలో నిల్చున్నారు.