జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు ఆదివారం ఎమ్మిగనూరు డీఎస్పీ సీతారామయ్య ఆధ్వర్యంలో కోసిగి సీఐ ప్రసాద్ పర్యవేక్షణలో ఎస్ఐ మహేష్ కుమార్ పెద్దకడబూరు మండల పరిధిలోని హనుమాపురం గ్రామ శివారుల్లో కొండలలోని నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 800 లీటర్ల నాటుసారా బెల్లం ఊటను ధ్వంసం చేసి 40 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. గ్రామాలలో నాటుసారా తయారీ చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.