‘ఢిల్లీ చలో’కు రైతులు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. వారిని కేంద్ర ప్రభుత్వం సోమవారం మరో దఫా చర్చలు జరిపేందుకు ఆహ్వానించింది. అన్నదాతల డిమాండ్ల పరిష్కారం దిశగా ఈ సమావేశంలో సమాలోచనలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు ‘ఢిల్లీ చలో’కు తాము మద్దతిస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. గత పదేళ్ల బీజేపీ పాలనలో అన్నదాతలు నాశనమయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.