ప్రభుత్వరంగ ఓఎన్‌జీసీ డిసెంబరు త్రైమాసికంలో రూ.9536 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.11,045 కోట్లతో పోలిస్తే ఇది 13.7% తక్కువ. ఇదే సమయంలో సంస్థ స్థూల ఆదాయం 10% దిగి వచ్చి రూ.34,789 కోట్లకు పరిమితమైంది.
చమురు, సహజవాయువు ధరలు తగ్గడమే ఇందుకు కారణమని సంస్థ తెలిపింది. సమీక్షా త్రైమాసికంలో ఉత్పత్తి చేసిన బ్యారెల్ ముడిచమురు విక్రయంపై సంస్థకు 81.59 డాలర్లు లభించాయి.