పలు రైల్లో చోరీలకి పాల్పడుతున్న ఇద్దరినీ అరెస్ట్ చేసి వారి నుంచి మొబైల్ ఫోన్లు నగదు రికవరీ చేశామని జిఆర్పి ఎస్ఐ అబ్దుల్ మారుఫ్ తెలిపారు. శ్రీను, పవన్ కుమార్ అనే వ్యక్తులు ఆదివారం తుని రైల్వేస్టేషన్లో 1వ నెంబర్ ప్లాట్ ఫారంపై అనుమానస్పదంగా సంచరిస్తుండగా వారిని పట్టుకుని తనిఖీలు చేశామన్నారు. వీరు వద్ద ప్రయాణికుల నుంచి చోరీ చేసిన 9 మొబైల్ ఫోన్లు, రూ. 2లక్షల నగదు దొరికాయి అన్నారు.