నిజాంపట్నం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా శ్రీనివాసరావు ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల విధుల్లో భాగంగా జరిగిన బదిలీలలో కారంచేడు లో పనిచేస్తున్న శ్రీనివాసరావు బదిలీపై నిజాంపట్నం వచ్చారు. ఇక్కడ పని చేసిన రమేష్ బదిలీపై చిన్నగంజాం పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.
ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ ముందస్తు ప్రణాళికలతో ఎన్నికలలో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తామని తెలిపారు.