ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పుడు మెగాస్టార్, ఇప్పుడు పవర్ స్టార్.. నాకు నమ్మకం ఉంది: హరిరామజోగయ్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 13, 2024, 08:38 PM

మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య కాపులకు మేలుకొలుపు పేరుతో మరో లేఖ విడుదల చేశారు. కాపులు, బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజ్యాధికారం దక్కాలంటే ఐకమత్యం ప్రదర్శించాలని.. అందుకు దైర్యవంతుడైన నాయకుడు కావాలి, జనాకర్షన గల సవ్యసాచి కావాలన్నారు. పవన్ కళ్యాణ్ పొత్తు ధర్మంలో తనకి దక్కాల్సిన ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను దక్కించుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయానికి ఒక వ్యూహాం ఉంటుందనడంలో సందేహపడాల్సిన పనిలేదు.. ధైర్యంగా ముందుకు నడవండి అంటూ లేఖ ద్వారా పిలుపునిచ్చారు


'కాపులు, బీసీల, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఆర్థికంగాను, విద్య, ఉద్యోగాలలోను బలహీనులమనే చెప్పాల్సి ఉంది. ఎన్నో ఏళ్ల తరబడి ఈ బడుగు బలహీనవర్గలా వారందరూ అగ్రవర్డాలలోని కొంతమంది నాయకులకు రాజకీయంగా వారికి తొత్తులుగా ఉంటూ ఊడిగం చేస్తూ కాలం గడుపుతున్న మాట నిజం. ఈ జాతుల్ని ఉపయోగించుకుంటూ వారు రాజకీయంగా ఎదుగుతున్నారు. రాజ్యాధికారం చేతుల్లో పెట్టుకుంటున్నారు. రావ్హ్రాన్ని ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. మన డబ్బుతోనే, మన శ్రమతోనే ఎదిగి తిరిగి మనల్ని కొంటున్నారు. దీనికి ముఖ్య కారణం మనం ఆర్థికంగాను, రాజకీయంగాను బలహీనులం. ఈ నిజాన్ని కాదనలేం. మన జాతులు యావత్తు యాచించే స్థితి నుండి శాసించే స్థితికి ఎదగాలి. రాజ్యాధికారం దక్కించుకోవాలి. గౌరవ స్థానం దక్కించుకోవాలి. ఆనాడే మనకు విముక్తి ఇది. ఎలా సాధ్యం? సాధ్యమే!' అన్నారు.


'ఈ కులాలకు రాజ్యాధికారం దక్కాలంటే ముందుగా మనం ఐకమత్యాన్ని ప్రదర్శించాలి. రాజకీయ లక్షణాలు పెంచుకోవాలి. మనం యితరులకు దేహీ అని చేయి చాచటం మానుకోవాలి. మన కాళ్లపై మనం నిలబడాలి. మనవాళ్లలో నాయకులుగా ఎదుగుతున్న వాళ్ళను సపోర్టు చేయటం ద్వారా వారిని ప్రోత్సహించాలి. వారి కాళ్లు పట్టుకోవటం ద్వారా క్రిందికి లాగటం మానుకోవాలి. వారికి మనం ఉన్నామంటూ ధైర్యం చెప్పడం ద్వారా రాజ్యాధికారం దక్కించుకొనే దిశగా చేతులందించి ముందుకు నడిపించాలి. అందుకు ధైర్యవంతుడైన నాయకుడు కావాలి. జనాకర్షణ గల సవ్వశాచి కావాలి. ఒకప్పడు నేనున్నాంటూ చిరంజీవి వచ్చాడు. అందరం ఆదరించాం. చేయూత నిచ్చాం. అభిమన్యుడై మిగిలాడు. దీనికి సవాలక్ష కారణాలు' అన్నారు.


'ప్రస్తుతం అదే బాటలో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ రాజకీయ అరంగ్రేటం చేశాడు. జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టాడు. అన్నకు మించిన జనాకర్షణ ఉంది. వామపక్ష భావాలు కలిగిన మనసున్నవాడు.. నిబద్దత కలిగిన నాయకుడు. పేదల పట్ల సానుభూతి కలిగినవాడు. చేతికి ఎముకలు లేనివాడు. బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి. అనుభవం తక్కువైనా కామన్‌సెన్స్‌ ఎక్కువున్నవాడు. అనేక పుస్తకాలు చదవటం ద్వారా రాజనీతి వంట పట్టినవాడు. రాజ్యాంగం క్షుణ్ణంగా తెలిసినవాడు. నీతివంతమైన పరిపాలనే ఆశయంగా ప్రజా క్షేమమే ధ్యేయంగా అంచెలంచెలుగా రాజ్యాధికారం దక్కించుకొనే దిశగా అడుగులు వేస్తున్న ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్. ఈ లక్ష్య సాధనకు ఆయన వ్యూహాలు ఆయనకు ఉన్నాయి. ఒంటరిగా అడుగులు వేస్తే ప్రస్తుతం తన పరిస్థితి ఏమిటో 2019 ఎన్నికల ఫలితాల దృష్ట్యా తెలుసుకున్నవాడు. యుద్దతంత్ర తెలుసున్నవాడు. అందుకే బలవంతుడైన అధికారంలో ఉన్న శత్రువుని కొట్టాల్సి వచ్చినప్పడు ఇష్టం ఉన్నా లేకపోయినా మరొక ప్రతిపక్షీయుడు సహకారం తీసుకోవటం రాజనీతిజ్ఞత అని తెలిసినవాడు. అందుకే తెలుగుదేశం పార్టీతో జతకట్టాడు. జనసేన తెలుగుదేశం పొత్తు ఆంధ్ర రాష్త్ర భవిష్యత్‌ అనే నినాదంతో ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా ఎన్నికలలో కలిసి ప్రయాణం చేయటమే శ్రేయస్కరం అనే యుద్దనీతి అనునరిస్తున్నాడు'అని లేఖలో ప్రస్తావించారు.


తన గౌరవానికి ఎటువంటి భంగం కలుగకుండానే తెలుగుదేశం క్రింద జననేన అని కాకుండా తెలుగుదేశం ప్రక్క జనసేన అని ప్రకటించాడు. తమ సరసన, తన క్షేమం కోరేవాడైన మోదీని కూడా ప్రక్కన పెట్టుకోటానికి పట్టుదలగా ఉన్నాడు. నాణ్యమైన కూడు, నివాసయోద్యమైన గూడు, ఉచిత విద్య, వైద్యం, కుటుంబాన్నిపోషించగల ఉపాధే ధ్యేయంగా సంక్షేమ పథకాలు ద్వారా వోమీలు ప్రకటిస్తూ ముందుకు దూసుకుపోబోతున్నది జనసేన. పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకు దక్కవలసియున్న శాసనసభా స్థానాలు, పార్లమెంటు స్థానాలు దక్కించుకోటానికి ప్రయత్తం చేస్తున్నాడు. జనసేన నెగ్గగల నీట్లు అనేకం ఉన్నాయి. అయితే ఎన్నికలలో విజయమే ధ్యేయంగా


ముఖ్యమైన పాత్ర వహించగల ఆర్థిక స్తోమత ఉన్న నమ్మకస్తులైన అభ్యర్థుల ఎంపికే కష్ట సాధ్యం. అదే ప్రయత్నంలో ఉన్నాడు. బలమైన అభ్యర్థులున్న నియోజకవర్గాలను జనసేన కైవసం చేసుకుంటుందనే దాంట్లో ఏమాత్రం సందేహపడాల్సిన పని లేదు. అలాగే దశలువారీగా రాజ్యాధికారం దక్కించుకొనే దిశగా అతని ప్రణాళికలు అతినిక ఉన్నాయనే దాంట్లో ఏమాత్రం సదేహపడనవసరం లేదు. ఆయన మాట్లాడే ప్రతి మాటకు, ఆయన తీసుకునే ప్రతి చర్యకు ఒక వ్యూహాం అంటూ ఉన్న మాట నిజం. చివరగా రాజ్బాధికారం దక్కించుకొనే విషయంలో మనల్ని యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి తీసుకొచ్చే విషయంలో మన గౌరవం నిలబెడతాడనే విషయంలోఏమాత్రం సందేహ పడాల్సిన పనిలేదని మా అభిప్రాయం' వ్యక్తం చేశారు.


'ఈ మహా యజ్ఞం కొనసాగింపులో బడుగు బలహీన వర్గాలైన మనవంతు పాత్ర ఎలా ఉండాలో మీకు వేరే చెప్పవలసిన పని లేదని అనుకుంటున్నా మీరంతా ధైర్భంగా ముందుకు నడవండి. విజయం మన పక్షాన్నే ఉంటుంది. పవన్ కళ్యాణ్‌కు నా వంతు సలహాలు ఎప్పడూ యిస్తూ ఆయన నడకకు సహకారం అందిస్తూ ఉంటా. ఈ యజ్ఞంలో భాగంగా విజ్ఞానవంతులు చందు జనార్ధన్‌గారి ఆధ్యర్యంలో నడుస్తున్నటవంటి కాపు జాగృతి, కాపు జేఏసీ వంటి సంస్థలు కూడా కాపు సంక్షేమ సేనతో భాగస్వాములై పాలుపంచుకొంటాయని ఆశిస్తున్నాను' అంటూ లేఖ రాశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa