రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర బుధవారం వాయిదా పడింది. సోనియాగాంధీ రాజ్యసభకు నామినేషన్ వేయడంతో పాటు రైతులు ఆందోళనల్లో పాల్గొనడంతో వాయిదా వేశారు. అయితే ఇవాళ తిరిగి బిహార్‌లోని ఔరంగాబాద్ నుంచి యాత్ర ప్రారంభమవుతుందని పార్టీ ప్రకటించింది. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ పాల్గొంటారని కాంగ్రెస్ వెల్లడించింది.