తిరుమలలో శుక్రవారం రథసప్తమి వేడుకలు నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా రేపు ఉదయం 5:30 నుంచి రాత్రి 9 వరకు ఏడు వాహనాలపై శ్రీవారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో జారీచేసే సర్వదర్శనం టోకెన్లు రద్దు చేసింది. రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa