రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంతం కావడం ఖాయమని డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ అన్నారు. ఇప్పటికే చాలామంది సీనియర్లు పార్టీని వీడడం ఆ పార్టీ దురదృష్టకరమని తెలిపారు. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీని వీడడం పార్టీకి పెద్దదెబ్బ అని పేర్కొన్నారు. భవిష్యత్లో మరికొంత మంది కాంగ్రెస్ను వీడుతున్నట్లు తనకు సమాచారం ఉందన్నారు.