డంపింగ్‌యార్డును తరలించాలని పాలకొండ నగర పంచాయతీ పరిధిలో గల ఒకటి, పది వార్డుల యువకులు కోరారు.ఈ మేరకు బుధవారం ఆయా వార్డుల పరిధిలో వీధుల ప్రజలు, యువకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... డంపింగ్ యార్డువల్ల అనారోగ్యానికి గురవుతున్నామని, పొగపీల్చడం వల్ల పలుసమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. డంపింగ్‌యార్డు తరలించాలని ఎన్నిమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆరోపించారు. కాగా ఈ విషయం నగర పంచాయతీ కమిషనర్ సర్వేశ్వరరావు తెలుసుకుని ధర్నా చేస్తున్న స్థలానికి వెళ్లారు. ఈ సమస్యను ఉన్నతాధి కారుల దృష్టికి తీసుకెళ్తానని హామీఇచ్చారు. పాలకొండ పట్టణంలోని 1, 2, 20 పరిధిలోని డంపింగ్‌యార్డును తరలించాలని ఆ వార్డు ప్రజలు, యువకులు గురువారం ధర్నా నిర్వహించనున్నారు. ఈ మేరకు నగర పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ ధర్నాచేయనున్నారు. ఈ మేరకు 1, 2, 20 వార్డుల్లో బుధవారం రాత్రి దండారా వేయించారు. డంపిం గ్‌యార్డు తరలించే వరకు పోరాటం చేద్దామని, ర్యాలీ పట్టణంలోని గొల్లవీధి సెంటర్ నుంచి బయలుదేరనున్నట్లు యువకులు పేర్కొన్నారు.