కలియుగ ప్రత్యక్ష దైవం, అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శుక్రవారం రధసప్తమి సందర్భంగా రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధశాఖా మంత్రి సిదిరి అప్పలరాజు కుటుంబ సమేతంగా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ రథసప్తమి రోజున సూర్యనారాయణ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రజానీకం అంతా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.