గుంటూరు నగరంలో నూతనంగా చేపట్టిన రోడ్ల నిర్మాణ పనుల వలన కొన్ని ప్రాంతాల్లో తాగునీటి పాత పైప్లైన్ల మరమ్మతులు, డ్రెయిన్ల పక్కన పైప్లైన్లు, నీటి కుళాయిలు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ, పాత జిఐ పైప్‌ల స్థానంలో నూతన పైప్లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. గురువారం శారదాకాలనీలో ప్రస్తుతం రూ. 4. 3 కోట్ల అంచనాలతో నూతన సిసి డ్రెయిన్లు, రోడ్లు నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు.