తాము I.N.D.I.A కూటమిలోనే ఉన్నామని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నాయకుడు ఒమర్ అబ్దుల్లా గురువారం స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్, లడఖ్‌లోని ఆరు లోక్‌సభ స్థానాల్లో మూడింటిలో పోటీపై కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు.
తాము విడిగా పోటీ చేస్తామని పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యానించిన కాసేపటికే ఒమర్ దానిపై స్పష్టత ఇచ్చారు. బీజేపీని ఓడించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు.