ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేసిన అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 16, 2024, 04:15 PM

గడచిన ఐదేళ్ల కాలంలో చీపురుపల్లి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పనులపై అధికార పార్టీ నాయకులు, మంత్రి బొత్స సత్యన్నారాయణ శ్వేతపత్రం విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున డిమాండ్‌ చేశారు. శంఖారావం కార్యక్రమంలో భాగంగా గురువారం చీపురుపల్లిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. సీనియర్‌ మంత్రిగా ఉన్న బొత్సకి కేబినెట్‌లో పవర్‌ లేదన్నారు. పరిశ్రమల మంత్రిగా, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా అయన ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. ఇసుక, మద్యం వ్యాపారాల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని నాగార్జున ఆరోపించారు. పాఠశాల విద్యార్థులకు నాసిరకం మెటీరియల్‌ అందజేశారని, పుస్తకాల ముద్రణలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అన్నారు. జనసే ఇన్‌చార్జి విసినిగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో బూతు సంస్కృతి నేర్పింది వైసీపీ పార్టీయేనన్నారు. సభలో మాజీ మంత్రి కిమిడి మృణాళిని, మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు, జనసేన నాయకులు లోకం మాధవి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com