రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుమలలో శుక్రవారం రథసప్తమి ఉత్సవాలు జరగనున్నాయి. ఒకేరోజు సప్త వాహనాలపై మలయప్పస్వామి ఆలయ మాడవీధుల్లో విహరించనున్నారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈరోజు ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
వాహనసేవల వివరాలు :
తెల్లవారుజామున 5.30 నుంచి 8 గంటల వరకు – సూర్యప్రభ వాహనం
ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం
మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం
మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం
సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం
సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం
రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం