బత్తలపలి మండలంలోని వెంకటగారిపల్లి సమీపంలో గల దర్గాలో బుధవారం రాత్రి చోరి జరిగినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. వెంకటగారిపల్లి సత్రం సమీపంలో మరుగొడ్డు వంక వద్ద ఉన్న దర్గాలో రోజూ లాగే నిర్వాహకులు బుధవారం పూజలు చేసి అనంతరం తాళాలు వేసి వెళ్లారు. తర్వాత గురువారం ఉదయం వచ్చి చూడగా.. తాళాలను పగిలిపో యి కనిపించాయి. దీంతో వారు దర్గాలోకి వెళ్లిచూడగా వెండి ఆభరణాలు కనిపించలేదు. హుండీలోని డబ్బు లు కూడా లేవు. దీంతో వెంటనే ముజావర్ వలీసాబ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 30 తులాల వెండి ఆభరణాలు, హుండీలోని రూ. 6వేల నగదును దొంటలు చోరీ చేశారని చెప్పారు. ఎస్‌ఐ సంఘటన స్థలానికి వెళ్లి ్ల పరిశీలించారు. క్లూస్ టీంతో సంఘటన స్థలంలోని వేలి ముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.