ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీకి మాజీ కేంద్రమంత్రి రాజీనామా.. ఆ నిర్ణయం బాధించింది, ఏ పార్టీలో చేరేది లేదని ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 16, 2024, 09:13 PM

టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాజీనామా చేశారు. ఎన్డీయేలో టీడీపీ చేరే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం కోటలో తన రాజీనామా ప్రకటన చేశారు. తాను ఐదేళ్ల క్రితం టీడీపీలో చేరానని.. అప్పట్లో టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చి బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిందన్నారు వి కిశోర్‌ చంద్రదేవ్‌. ఆ విధానాల ప్రభావం వల్లే తాను టీడీపీలో చేరానని చెప్పారు. టీడీపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లినా గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి వచ్చిన సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని అభిప్రాయపడ్డారు.


బీజేపీతో పొత్తుకు టీడీపీ ప్రయత్నిస్తోందనే కారణంతోనే పార్టీకి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ పంపానని పేర్కొన్నారు. తాను ఏ పార్టీలో చేరనని, స్వతంత్రంగా పోటీచేయడానికి అరకు పార్లమెంటు స్థానం అనువైనది కాదన్నారు. అందువల్ల తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మన భిన్నత్వం మధ్య ఐక్యత మన రాజ్యాంగానికి హాల్‌ మార్క్‌ అన్నారు. ఇప్పటికే చిన్నాభిన్నమైన సమాజంలో మతోన్మాదుతులు చీలికలు సృషిస్తున్నారన్నారు. మతోన్మాదుల బీభత్స పాలనకు తెరలేపడం ద్వారా ఓటు బ్యాంకులను సృష్ట్టించుకోవడమే ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ వన్‌ పాయింట్‌ ప్రోగ్రాంగా కనిపిస్తోందన్నారు. తన రాజకీయ జీవితంలో 5వ దశాబ్దంలో.. తాను చూసిన అత్యంత దారుణమైన పరిస్థితి ఇదే అన్నారు. విద్వేష శక్తులతో చేతులు కలపడం సహించరాని విషయం. అధికారం కోసం తన ఆత్మను అమ్ముకోలేను అని రాజీనామా లేఖ రాశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com