విద్యార్థులు సమాజంలో గొప్ప వ్యక్తులుగా తయారు కావాలని అంతర్ జాతీయ విశ్వహిందూ పరిషత్ మాజీ అధ్యక్షులు రాఘవరెడ్డి అన్నారు. నంద్యాల మహానంది రోడ్డులోని ఎయిమ్స్ ఫర్ సేవా కేంద్రాన్ని రాఘవరెడ్డి శనివారం పర్యటించారు. విద్యార్థులు చదువుతోపాటు సభ్యత సంస్కారాలు ముఖ్యమని అన్నారు. గతాన్ని మర్చిపోకుండా తల్లిదండ్రులను గౌరవిస్తూ సమాజంలో గొప్ప వ్యక్తులుగా తయారు కావాలన్నారు.