రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. పోలీస్, రెవెన్యూ, అటవీ, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో 721 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చాటగొట్ల, కోవూరులో మరణించిన కోళ్ల బ్లడ్ శాంపిళ్లను భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపామని, ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా (బర్డ్ ఫ్లూ) సోకినట్లు నిర్ధారణ అయినట్లు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్రకుమార్ తెలిపారు.