రైళ్లు పరస్పరం ఢీకొట్టుకోకుండా ఉండేందుకు రూపొందించిన స్వదేశీ టెక్నాలజీ 'కవచ్'ను వందే భారత్ రైలులో తాజాగా పరీక్షించారు. ఇది విజయవంతమైంది.
ఇందులో భాగంగా మథుర-పాల్వాల్ మధ్య వందేభారత్ రైలును గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిపారు. లోకోపైలట్ బ్రేకులు వేయలేదు. అయినప్పటికీ కవచ్ టెక్నాలజీ రెడ్ సిగ్నల్‌ను పసిగట్టింది. వెంటనే ఆటోమేటిక్‌గా బ్రేక్ వేసి సిగ్నల్‌కు 10 మీటర్ల దూరంలో రైలును ఆపింది.