పాయకరావుపేట మండలం పెంటకోట గ్రామానికి చెందిన చేపల మనోజ్ అనకాపల్లి జిల్లా విద్యార్థి విభాగానికి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. వైయస్సార్ సీపీ అధ్యక్షులు సీఎం జగన్ ఆదేశానుసరం నిన్న అధిష్టానం విడుదల చేసిన అనకాపల్లి జిల్లా విద్యార్థి విభాగ కమీటీ విభాగంలో ఆయన పేరు ఉండటంతో పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఈ గుర్తింపు రావటానికి ముఖ్య కారకులైన చిక్కాల రామారావుకి ఆయన కృతజ్ఞతలు తెలుపుకున్నారు.