ఛత్తీస్‌గఢ్ డోంగర్‌ఘర్‌లోని ప్రఖ్యాతి గాంచిన బమలేశ్వరి ఆలయంలో షాకింగ్ ఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం భక్తుల రద్దీ అధికంగా ఉంది.
ఆ సమయంలో ఆలయంలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్‌పై అశ్లీల వీడియో కనిపించింది. చిన్నపిల్లలతో సహా కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు దీనిని చూసి నివ్వెరబోయారు. దీనికి కారకులెవరో తెలియలేదు. ఆలయ ట్రస్టు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa