అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పలు బ్యాంకులను మోసం చేసిన కేసులో న్యూయార్క్ కోర్టు ఆయనకు ఊహించని షాక్ ఇచ్చింది.
364 మిలియన్ డాలర్ల ఫైన్ విధించింది. భారత కరెన్సీలో దీని విలువ రూ.3వేల కోట్ల కంటే ఎక్కువే. సివిల్ కేసు కావడంతో కోర్టు జైలు శిక్ష విధించలేదు. ఈ తీర్పుపై ట్రంప్ తరుపు న్యాయవాదులు స్పందించారు. అప్పీల్‌కు వెళ్తామని పేర్కొన్నారు.