తమిళనాడు ప్రభుత్వం శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పీచుమిఠాయి (Cotton Candy)పై నిషేధం విధించినట్లు ప్రకటించింది.
ఓ అధ్యయనంలో పీచుమిఠాయిలో క్యాన్సర్ కారకమైన రోడమిన్‌బే-బి ఉంటుందని తేలింది. దీంతో పీచుమిఠాయిని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫుడ్ సేఫ్టీ & స్టాండర్డ్స్ యాక్ట్ - 2006 ప్రకారం పీచుమిఠాయిని అసురక్షిత ఆహారంగా ప్రభుత్వం గుర్తిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.