తరతరాలకు సరిపడా సంపద సృష్టిలో అత్యుత్తమ దేశంగా స్విట్జర్లాండ్ నిలిచింది. సంపాదన సంభావ్యత, కెరీర్లో పురోగతి, ఉపాధి అవకాశాలు, ప్రీమియం విద్య, ఆర్థిక చలనశీలత,
జీవనోపాధి వంటి ఆరు విభిన్న పారామితుల ఆధారంగా దీనిని అంచనా వేస్తారు. ఇందులో 85శాతం స్కోర్‌తో స్విట్జర్లాండ్ అత్యుత్తమ స్థానాన్ని దక్కించుకోగా, 82శాతంతో అమెరికా రెండో స్థానంలో ఉంది. ఇక 32శాతంతో భారత్ చివరి స్థానంలో ఉంది.