తమిళనాడులో ఓ భక్తుడు దేవుడికి రాసిన లేఖ వైరల్ అవుతోంది. ఏకంగా తన అప్పు తీర్చాలంటూ దేవుడ్ని వేడుకున్నాడు. ఓ లేఖ రాసి హుండీలో వేయడం ఇక్కడ అసలు ట్విస్ట్. ధర్మపురి కుమారస్వామిపేటలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయ హుండీ కానుకలు లెక్కిస్తున్న సమయంలో అందులో ఓ లేఖ కనిపించింది. సిబ్బంది వెంటనే దానిని తీసుకుని చూడగా.. ఓ భక్తుడు తనకున్న అప్పుల వివరాలను పేర్కొని వాటిని తీర్చాలని కింద శ్లోకాలతో రాసి ఉన్నాడు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరలవుతోంది. తనకు రూ.కోటి వరకు ఉందని.. ఆ అప్పుల బాధ తీర్చాలంటూ ఆ భక్తుడు స్వామిని వేడుకున్నాడు. ఎవరు ఎవరికి ఎంత రుణం ఇవ్వాలి? గోల్డ్ లోన్, యూనియన్ లోన్, ఇంటి రుణం మొత్తం విడివిడిగా లెక్కలు కూడా ఆ లేఖలో రాసుకొచ్చాడు. మొత్తం కోటి రూపాయల అప్పుల సమస్యను దేవుడు పరిష్కరించాలని కోరాడు. ఈ లేఖను ఎవరు రాశారు అన్నది వివరాలు తెలియలేదు. ఈ లేఖను చదివిన ఆలయ సిబ్బంది షాకయ్యారు.