రాహుల్ యాత్రలో పాల్గొనడంపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లక్నోలో సోమవారం మీడియాతో మాట్లాడారు. యూపీలో లోక్సభ స్థానాల పంపకం తర్వాతే తాను రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొంటానని చెప్పారు.
ఇప్పటికే I.N.D.I.A కూటమికి నితీష్ దూరం అయ్యారు. మమతాబెనర్జీ, కేజ్రీవాల్ ఒంటరిగా పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. ఈ తరుణంలో అఖిలేష్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.