నిరుద్యోగులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. భారతీయ రైల్వేలో 9 వేల టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్(RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇందులో టెక్నీషియన్ గ్రేడ్-1 (సిగ్నల్) పోస్టులు 1,100, టెక్నీషియన్ గ్రేడ్ 3లో 7,900 పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాలను బట్టి టెన్త్, ITI, డిప్లొమాఇంజినీరింగ్ ఉత్తీర్ణులై, 18-33 ఏళ్ల వయస్సు ఉండాలి. మార్చి 9 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.