జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రామభద్రాచార్య అసలు పేరు గిరిధర్ శర్మ. యూపీలోని జౌన్పూర్ జిల్లాలో జన్మించిన గిరిధర్ శర్మకు రెండేళ్ల వయస్సులో ట్రకోమా వల్ల కంటిచూపు కోల్పోయారు. ఈయన శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించాడని నిరూపించేందుకు హైకోర్టులో 441 సాక్ష్యాలను సమర్పించగా.. అందులో 437 సాక్ష్యాలను కోర్టు అంగీకరించింది.
సోనియాగాంధీ దాఖలు చేసిన అఫిడవిట్ లో ఈ నేలపై రాముడు పుట్టలేదన్న వాదనపై నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కి సమాధానమిస్తూ.. "మీ గురుగ్రంథ సాహిబ్ లో రాముడి పేరు 5,600 సార్లు ప్రస్తావించబడింది." అని సమాధానమిచ్చారు.