వైఎస్ఆర్ కళ్యామస్తు, షాదీ తోఫా నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారం విడుదల చేయనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కడం ద్వారా ఐదో విడత వధువు తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. కాగా, 2023లో వివాహం చేసుకున్న 10,132 జంటలకు రూ.78.53 కోట్ల ఆర్థిక సాయం అందనుంది.