అనకాపల్లి జిల్లాలో ఈనెల 25వ తేదీన నిర్వహించే ఏపీపీఎస్సీ గ్రూప్-2 స్ర్కీనింగ్ పరీక్షలు సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ జాహ్నవి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరీక్షల ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం ఇవ్వొద్దని స్పష్టం చేశారు. అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, మాకవరపాలెంలలో 33 కేంద్రాల్లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 10,627 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సెక్షన్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.