నెల్లిమర్ల మండలం కొత్తపేటలో కొలువుదీరిన చిన్న అన్నవరంగా పేరుగాంచిన వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం దంపతులు వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై రామస్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త కొండేటి సురేష్ పర్యవేక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa