కేంద్రంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు 'ఢిల్లీ చలో' ఆందోళన శాంతియుతంగా నిర్వహిస్తామని రైతు నేతలు ప్రకటించారు.
కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన అనంతరం వారు మాట్లాడారు. అన్ని పంటలకు మద్ధతు ధర ఇచ్చేందుకు కేంద్రం సమ్మతించటం లేదని పేర్కొన్నారు. ప్రతిపాదనలపై సంఘాలన్నీ చర్చించుకున్న మీదుట ఈ నిర్ణయానికి వచ్చినట్లు వారు స్పష్టం చేశారు.