జనహిత సొసైటీ, కౌన్సిలర్ సతీశ్ కుమార్, నాగరాజు ఆధ్వర్యంలో సోమవారం హిందూపురం పట్టణంలోని కొట్నూరు పాఠశాలలో కొనసాగిన ఉచిత కంటివైద్య శిబిరంలో 25 మంది కంటి శస్త్రచికిత్సలు అవసరమని నిర్వాహుకులు తెలిపారు. శిబిరానికి హాజరైన 60 మందిని కంటి వైద్యులు జింకాకృష్ణమోహన్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగభూషణం,నాగన్న, మూర్తి పాల్గొన్నారు.