సిద్ధం సభలలో ర్యాంపులు ఎక్కి అపద్దపు మాటలు చెబుతున్న సిఎం జగన్ రెడ్డి ఫ్యాను రెక్కలు విరిచేందుకు జనం సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ ఎద్దేవా చేశారు. సోమవారం గుంతకల్లు పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సైకో పాలనతో విసిగిపోయిన ప్రజలు త్వరలో జరుగనున్న ఎన్నికల్లో జగన్ రెడ్డి ఫ్యాను రెక్కలు విరిచి ఇంటికి పంపుతారన్నారు. సమావేశంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.