రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలం బ్రహ్మసముద్రం గ్రామంలో మంగళవారం వైసిపి నాయకులు విస్తృత ప్రచారం చేపట్టారు. నియోజకవర్గ సమన్వయకర్త తనయుడు మెట్టు విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైసిపి నాయకులు ప్రతి గడపను సందర్శించారు. ఇప్పటివరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన మంచిని వివరించారు. సంక్షేమ పథకాలు ఇలానే కొనసాగాలంటే మరోసారి సీఎం గా జగనన్నను ఆశీర్వదించాలని విజ్ఞప్తించారు.