బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల్లో మొబైల్ ఫోన్లను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై సోమవారం సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు.
ఫోన్ల వల్ల తరగతి గదుల్లో విద్యార్థులు చదువుపై దృష్టి సారించడం లేదన్నారు. దీంతో విద్యార్థుల చదువుకు అంతరాయం కలగకుండా ఉండేందుకు చాలా పాఠశాలలు ఫోన్లను నిషేధించాయన్నారు. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ ఇది అమలవ్వాలన్నారు.