ఇంటి స్థలాల కోసం దరఖాస్తులు తీసుకున్న నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చిన్న ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం చిలమత్తూరు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి ఇల్లు లేని నిరుపేదల దరఖాస్తులు చేసుకునే 90 రోజుల్లో ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరారు. అనంతరం తహసిల్దార్ బాల నరసింహకు వినతిపత్రం అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa