టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు నుంచి 23వ తేదీ వరకు కుప్పం, పలమనేరు,
పుంగనూరు, పూతలపట్టు, చిత్తూరు, నెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల్లో పర్యటన కొనసాగుతుంది. చంద్రబాబు అరెస్ట్ సమయంలో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాల ఇళ్లకు ఆమె వెళ్లనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్ష్లల ఆర్థిక సాయం చేయనున్నారు.