ప్రపంచ దేశాల్లో తమదైన ప్రత్యేక టూరిజం ప్రదేశాలున్నాయి. వాటిలో ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి. ప్రపంచంలో అతి తక్కువ జనాభా కలిగిన చిన్న దేశం వాటికన్ సిటీ. ఇది పోప్ హోమ్ సిటీ.
ఇది అంతాకలిపి 0.19 చదరపు మైలు (0.30 కిలోమీటర్) మాత్రమే ఉంటుంది. అంటే చిన్న పట్టణ కేంద్రంలా ఉంటుంది. ఇక్కడ జనాభా సంఖ్య చాలా తక్కువ. పర్మనెంట్‌గా ఉన్న వారు 800 మంది మాత్రమే. కానీ ఏటా దీన్ని చూసేందుకు 50 లక్షల మంది దాకా పర్యాటకులు వస్తున్నారు.