మార్చి 9 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు పూర్తి చేసింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను మే లోపు నిర్వహించాల్సి ఉంది.
వీటితో పాటు జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. మార్చి 13 తర్వాత దీనిపై స్పష్టత రానుంది. గత సార్వత్రిక ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్ విడుదలైంది.