ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నికరం పల్లి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి తన ఇంట్లో నిద్దరిస్తున్న వెంకటేశ్వర్లు అనే యువకుడ్ని కాశి రామిరెడ్డి అనే యువకుడు విచక్షణ రహితంగా గొడ్డలితో నరికి హత్య చేశాడు. అడ్డుగా వచ్చిన భార్య తిరపతమ్మ చెయ్యి నరకడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు.