ప్రజా సమస్యల సత్వర పరిష్కారం నిమిత్తం ప్రభుత్వం రూపొందించిన జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం బుధవారం నిర్వహిస్తున్నట్లు యద్దనపూడి ఎంపీడీవో శివ సుబ్రమణ్యం మంగళవారం తెలిపారు. యద్దనపూడి జడ్పీ హైస్కూల్ లో నిర్వహించే ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా హాజరవుతారని చెప్పారు. అర్హులై ఉండి కూడా లబ్ధిపొందని ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి వాటిని అక్కడికక్కడే పరిష్కరించుకోవాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa