పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఈ విషయమై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇచ్చిన నోటీసులకు స్పందించలేదు. వైసీపీ నుండి టిడిపిలోకి నలుగురు, టిడిపి నుండి వైసీపీలోకి నలుగురు ఎమ్మెల్యేలు మారగా ఆయా పార్టీలు వారి మీద ఫిరాయింపు చట్టం కింద చర్యలు తీసుకోవాలని స్పీకర్లు ను కోరగా ఆయన నోటీసులు జారీ చేశారు. కానీ సోమవారం వరకు బలరాం బదులు ఇవ్వలేదని సమాచారం. ఏమవుతుందో చూడాలి.