ఏపీలోని పౌల్ట్రీ పరిశ్రమలకు బర్డ్ ఫ్లూ వణుకు పుట్టిస్తోంది. గత వారం నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వల్ల పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. దాంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై ఆయా జిల్లాలను హెచ్చరించింది.
పౌల్ట్రీలు ఎక్కువగా ఉన్న కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేసింది. విదేశీ వలస పక్షులు, కోళ్ల రక్త నమూనాలను సేకరిస్తోంది.