గాజాలో యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలని బ్రిటన్ యువరాజు విలియమ్స్ పిలుపునిచ్చారు. ‘కొన్నిసార్లు తీవ్ర మానవ సంక్షోభం తలెత్తితేగానీ శాశ్వత శాంతి ప్రాముఖ్యత మనకు అవగతం కావడం లేదు’ అని ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.
సాధారణంగా రాజ కుటుంబీకులు ఇటువంటి వివాదాస్పద అంశాలపై స్పందించరు. కానీ కాల్పుల విరమణపై బుధవారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో ఆయన ప్రకటన విడుదల చేశారు.